15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గ్రామంలోకి వరద నీరు

31-10-2025 12:00 AM

కోదాడ అక్టోబర్ 30: కోదాడ మండల పరిధిలో మంగలి తండా గ్రామంలో ఉన్న ఎన్ ఎస్ పి కాలువ ఆక్రమణకు గురికావడంతో దాని నుంచి వచ్చే వరద నీరు గ్రామంలోకి చేరడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ శివారులో కొంతమంది ఎన్‌ఎస్పి కాలువను ఆక్రమించుకొని దానిపై కొంతమంది గున లు వేయడం తో ఈ పరిస్థితి దాపురించింద నీ గ్రామస్తులు వాపోతున్నారు. వరద నీరు ఓ వృద్ధురాలి ఇంట్లోకి చేరడంతో చేసేదేం లేక వరద నీటిలోనే స్టూల్ వేసుకొని కూర్చుంది.

అన్నం వండుకునే పరిస్థితి లేద ని వాపోయింది. ఎన్ ఎస్ పి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎప్పుడు వరదలు వచ్చిన గ్రామస్తులు బిక్కుబిక్కున బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు వరద నీరు గ్రామంలోకి చేరిందని వరద నీరు వల్ల అనేక రోగాలు వస్తున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు.