calender_icon.png 31 October, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధినిర్వహణలో అమరులైన పోలీసుల పాత్ర కీలకం

31-10-2025 12:00:00 AM

మహేశ్వరం డీసీపీ సునీతరెడ్డి 

మహేశ్వరం అక్టోబర్ 30 (విజయక్రాంతి) : విధి నిర్వహణలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఎదురు నిలిచి అమరులైన పోలీసుల పాత్ర ఎంతో కీలకమని మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి పేర్కొన్నారు గురువారం అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆమె మహేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రక్షణ విభాగంలో ప్రజలకు వెన్నంటి ఉండి తోడునీడగా తానై పోరాడతానంటూ ఒక కవచంగా మారి ప్రతి సమస్యకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ముందుగా  ప్రణామాలు చెప్పుకోవాలని ఆమె తెలియజేశారు.

పోలీసు ఉన్నత ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరు కుటుంబాలను వదిలి రాత్రింబవలు తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతూ ప్రాణాలు అర్పించిన సంఘటనలు కోకొల్లలు అని ఆమె తెలియజేశారు.పోలీసు వృత్తి సర్వసాధారణం కాదని ఎంతో మహోన్నత శిఖరాలకు తావు ఇస్తుందని డీసీపీ సునీత రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఏటా అమరులను తలచుకోవడం ఎంతో బాధగా ఉన్నా విధినిర్వాహంలో ఇలాంటివి జరగడం సహజమే అన్నారు.

రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆమె తెలిపారు.ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్క పోలీసు నిబద్ధతతో పనిచేసుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న నిజమైన వ్యక్తి పోలీసు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏసిపి జానకి రెడ్ది, సిఐ సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.

మెగా రక్తదాన శిబిరం

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30: పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, ఇబ్రహీంపట్నం డివిజన్లోని ఆరు పోలీస్ స్టేషన్లు కలిసి, ఏసీపీ ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి ఫంక్షనల్ హాల్ లో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో మహేశ్వరం జోన్ డీసీపీ సునీతరెడ్డి,  ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు పాల్గొని మాట్లాడారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివనీ,  ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బంది స్ఫూర్తిగా, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. అధికారులు రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించి, ప్రతి ఒక్కరూ ఈ మహత్తర సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో మొత్తం 200 మంది సివిల్ సభ్యులు, పోలీస్ అధికారులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, సమాజానికి సేవ చేయడం ద్వారా వారి స్ఫూర్తిని కొనసాగించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డివిజన్కు చెందిన అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.