31-10-2025 12:00:00 AM
 
							ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30: ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్రం కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్, డిగ్రీ,పారామెడికల్, ఇంజనీరింగ్, లా కళాశాలలో బంద్ కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల బంద్ ను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విద్యార్థులకు సుమారుగా 8500 కోట్ల పెండింగ్స్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల కావాల్సిన ఉందని, కానీ ప్రభుత్వం మాత్రం తమకు ఎం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు.
గత ప్రభుత్వ నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడిందని అందుకే విద్యార్థులంతా ఏకమై గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. విద్యార్థులు, పై చదువులు చదువుకోడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విద్యాశాఖకు మంత్రిని కేటాయించి విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షులు బోడ వంశి, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు మద్దెల శ్రీకాంత్, మంచాల మండల కార్యదర్శి రామ్ చరణ్, యాచారం మండల అధ్యక్షులు అజయ్, నాయకులు జశ్వంత్, సాయిరాం, సిద్దు, ప్రశాంత్, వినయ్, మనీ తదితరులు పాల్గొన్నారు