06-07-2025 01:33:38 AM
తిరువనంతపురం, జూలై 5: కేరళలో నిఫా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. పాలక్కాడ్ జిల్లాలలోని 38 ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. ప్రస్తుతం ఆమె ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్నారు.
సాధారణ వైద్య పరీక్షల సమయంలో ఆమెలో నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో సంబంధిత నమూనాలను పుణె ప్రయోగశాలకు పంపించారు. ఇప్పటివరకు అధికారికంగా ఇద్దరికి పాజిటివ్ సోకినట్టు తేలింది. మరోవైపు కోజికోడ్ జిల్లా మలప్పురంలో 18 ఏళ్ల అమ్మాయి నిఫా వైరస్ సోకి జైలూ 1న మరణించింది. ఈ ఇద్దరిని కాంటాక్ట్ అయిన వారిలో 425 మంది ఉన్నట్టు సమాచారం.