10-05-2025 12:08:38 AM
- దుమ్ము, ధూళి రేపుతున్న రోడ్డు
- రోడ్డుమీద ప్రవహిస్తున్న మురుగునీరు
- రాజకీయ ఒత్తిళ్లతో మౌనంగా ఉంటున్న అధికారులు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు
- నరకం అనుభవిస్తున్న స్థానికులు
మేడ్చల్, మే 9(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో ఫ్లైఓవర్ పనులు కాంట్రాక్టర్ ఇ ష్టారాజ్యంగా చేయడం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతు న్నారు.
నిబంధనల ప్రకారం రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ముందుగా రోడ్డు వెడల్పు చేసి ఆ తర్వాత పనులు ప్రారంభించాలి. కానీ రోడ్డు వెడల్పు చేయకుండానే ఫ్లై ఓవర్ పిల్లర్ల పనులు మొదలు పెట్టడంతో రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుంది.
వాస్తవానికి ఇది జాతీయ రహదారి కావడం వల్ల మాస్టర్ ప్లాన్ ప్రకారం 200 అడుగుల రోడ్డు ఉండాలి. కానీ 150 అడుగులకు కుదించారు. 150 అడుగుల రోడ్డు ముందుగానే వెడల్పు చేసి ఆ తర్వాత ఫ్లైఓవర్ పనులు మొదలు పెడితే అంతగా ఇబ్బంది ఉండేది కాదు. 150 అడుగుల రోడ్డు వెడల్పుకు పెద్దగా భూసేకరణ కూడా అవసరం లేదు. కొద్దిగానే భూమి అవసరం అవుతుంది. కాంట్రాక్టర్ డబ్బులు మిగిల్చుకోడానికే ఉన్న రోడ్డుపైనే పిల్లర్ల పనులు మొదలు పెట్టాడు.
రోడ్డుమీద మురుగునీరు ప్రవాహం
కాంట్రాక్టర్ నిర్రక్ష్యం వల్ల మురుగునీరు ప్రధాన రహదారి మీద ప్రవహిస్తోంది. ప్ర ధాన రహదారికి ఇరువైపులా ఓపెన్ డ్రైనేజీ ఉంది. బస్ డిపో వద్ద ఓపెన్ డ్రైనేజీని కాం ట్రాక్ట్ కంపెనీ సిబ్బంది పూడ్చివేశారు. ఫ్లైఓవర్ కు ఇరువైపులా బాక్స్ డ్రైనేజీ కాంట్రాక్టర్ నిర్మించాలి. బాక్స్ డ్రైనేజీ నిర్మించకుండా ఉన్న డ్రైనేజీని పూడ్చి వేయడంతో మురుగునీరు రోడ్డు మీద ప్రవహించే దుర్గంధం వ్యా పిస్తోంది. అంతేగాక పాదాచారులు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. మున్సి పాలిటీ వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉంది.
దుమ్ము, ధూళితో ఇబ్బంది
పిల్లర్లు నిర్మించినచోట చుట్టూ ఎక్కువ విస్తీర్ణంలో తవ్వారు. పిల్లర్ నిర్మాణం పూర్తయిన తర్వాత మట్టి వేసి వదిలేశారు. ఆ ప్రాంతం ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది. ఆ ప్రాంతంలో గుంతలు ఏర్పడడమే గాక, దుమ్ము ధూళి లేచి ప్రజలు ఇ బ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హోటళ్లలోని తిను బండారాల మీద దుమ్ము పడు తుంది. కిల్లర్ కోసం నిర్మించిన ప్రాంతంలో తారు వేయాల్సిన అవసరం ఉంది.
తరచూ ప్రమాదాలు
ఫ్లై ఓవర్ నిర్మాణం సందర్భంగా ప్రమాద నివారణ చర్యలు తీసుకోనందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వా హనాలను భారీ వాహనాలు వెనుక నుంచి ఢీకొనడం, రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాలు ఢీకొనడం వల్ల మృత్యువాత ప డ్డారు. పనుల ప్రారంభమైన ఏడాది కాలం లో 20 మంది వరకు మరణించారు. ద్విచక్ర వాహనాల మీద రోడ్డు మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
అధికారులపై రాజకీయ ఒత్తిడిలు
కాంట్రాక్టు కంపెనీకి రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులపై ఒత్తిడిలు వస్తున్నాయి. దీంతో అధికారుల సైతం ఏమీ చేయలేకపోతున్నారు. దీనిపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఒక్కరూ మాట్లాడడం లేదు. ప్రజలు నరకం అనుభవిస్తున్న పట్టనట్లు ఊరుకుంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎంపీ తో పాటు కాంగ్రెస్ నాయకులు ఈ సమస్యను పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.