10-05-2025 12:09:02 AM
భూత్పూర్, మే 9 : గత 20 ఏళ్ల క్రితం నుంచి వివిధ పత్రికలలో జర్నలిస్టుగా పని చేస్తూ సంవత్సరం క్రితం దివంగతులు అయిన ఏ. రాములు కుటుంబానికి రాష్ట్ర ప్రెస్ అకాడమీ వారు జర్నలిస్టులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ పత్రికలలో పనిచేస్తూ దివంగతులు అయిన 25 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మంత్రి, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్, ఏ. రాములు , భూత్పూర్ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు యాదగిరి, సి. నరసింహులు తదితరులు ఉన్నారు.