7 May, 2026 | 2:16 AM

వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించండి

07-05-2026 01:25 AM

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి

వనపర్తి, మే 6 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా ఉద్యానవనాలు మరియు పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల మార్పిడిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు ప్రణాళికా సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 కోట్ల మంది జనాభా కలిగిన భారత దేశంలో ప్రజలకు అవసరమైన మేరకు ఆయిల్ గింజలు, పప్పు దినుసులు లేవని వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొవటానికి మన ఫోరెన్సిక్ నిల్వలు బయటి దేశాలకు వెళ్లి పోతున్నాయని చెప్పారు. అందుకే మన దేశంలోనే ఆయిల్ గింజలు సాగు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

నూనె గింజల్లో అత్యధికంగా ఆయిల్ వచ్చే పంట కేవలం పామాయిల్ పంటకే ఉందని, అత్యధికంగా లాభసాటి పంట ఏదైనా ఉందంటే అది పామాయిల్ పంట అని కొనియాడారు. అందుకే రైతులు వరి పంట కాకుండా పామాయిల్, పప్పు గింజలు, కూరగాయల వైపు దృష్టి మళ్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, ప్రత్యేక నోడల్ అధికారి ప్రసాద్ రావు, మాజీ జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ కృపాకర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి, వీణా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయ్ భాస్కర్, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.