calender_icon.png 20 December, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండిపెండెంట్లపై ఫోకస్!

20-12-2025 12:00:00 AM

  1. ‘స్వతంత్ర’ సర్పంచులకు పార్టీల గాలం
  2. ప్రలోభాలు ఎరవేస్తూ ఆపరేషన్ ఆకర్ష
  3. ఊగిసలాటలో పంచాయితీ పాలకులు
  4. ప్రమాణ స్వీకారోత్సవం నాటికి తేల్చాలని యోచన

సంగారెడ్డి, డిసెంబర్ 19(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులకు వివిధ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో జరిగిన మొదటి, రెండవ, మూడో విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 766 మంది గెలుపొందగా, బీఆర్‌ఎస్ మద్దతుదారులు 609 మంది, బీజేపీ మద్దతుదారులు కేవలం 54 మంది మాత్రమే గెలుపొందారు.

స్వతంత్ర అభ్యర్థులు మొత్తంగా 139 మంది గెలుపొంది మూడవ స్థానాన్ని పొం దారు. అయితే స్వతంత్రులు ఏ పార్టీలోకి ఎక్కువ సంఖ్యలో చేరుతారో.. ఆ సంఖ్యతో మెజార్టీ మార్క్ అటు.. ఇటుగా మారే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్ర స ర్పంచులపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. వారిని పార్టీలో చేరాలని ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే గెలుపొందారు.

అలాగే రెండు పార్లమెంట్ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్, మరొకటి బీజేపీ కైవసం చేసుకున్నాయి. ఉ ద్యమాల గడ్డగా పేరొంది గ్రామీణ స్థాయిలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్కు సంఖ్యా పరంగా తక్కువైనా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. స్వతంత్రులుగా గెలిచిన వా రిలో కూడా అధిక శాతం బీఆర్‌ఎస్, కాం గ్రెస్ పార్టీ రెబల్స్ ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇటు అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్‌ఎస్, స్వతంత్రులను పార్టీలోకి లాగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందు కోసం వారిని నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

ప్రధాన పార్టీల గాలం... 

స్వతంత్రులను తమవైపు ఆకర్షించేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రలోభాలు మొదలుపెట్టాయి. అధికార కాంగ్రెస్ నాయకులు ’మీ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు కే టాయిస్తాం... నిధులు ఇచ్చి అభివృద్ధి ప నులు చేపడతాం‘ అని వారికి ఎర వేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలున్న చోట ఆయా పార్టీలు.. ’మా ఎమ్మెల్యే అన్నీ చూసుకుంటా రు’ అని భరోసానిస్తున్నారు’. ఇది ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాల్సిందే. మొత్తంగా స్వతంత్రులను పార్టీలోకి లాగి కండువా వేసేద్దామనే వేగిరం వారిలో కనిపిస్తోంది. అయితే స్వతంత్ర సర్పంచులు ఏ పార్టీకి వెళ్లాలనే ఊగిసలాటలో ఉన్నారు.

ప్రలోభాల పర్వం...

వంచాయతీ ఎన్నికలు ముగిసినప్పటికీ ప్రలోభాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు డబ్బులు, మద్యం పంచారు. విం దులు ఏర్పాటు చేశారు. సర్పంచులుగా ఎ న్నికైన స్వతంత్రులను వివిధ రాజకీయ పార్టీ లు వారిని లాగేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్వం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మా రింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు.. ఇ ప్పుడేమో స్వతంత్ర సర్పంచులను ఆకర్షించేందుకు నేతల ప్రలోభాల పర్వం పనిచే స్తోందనే చర్చ అంతటా వినివిస్తోంది. ఈనెల 22న జరిగే నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవం నాటికి సాధ్యమైనంత వరకు స్వతంత్రులను లాగేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.