20-12-2025 12:00:00 AM
సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే మురళి నాయక్
కేసముద్రం, డిసెంబర్ 19 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు గ్రామ సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించి మద్దతు పలికారని, ప్రజల ఆకాంక్షల మేరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రభుత్వ సహకారంతో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను, ఉప్పుసర్పంచులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, పీసీసీ మెంబర్ దశ్రు నాయక్, డీసీసీ ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, పీఎసీఎస్ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, బండారు దయాకర్, మార్కెట్ డైరెక్టర్లు ఓలం రమేష్, చిదురాల వసంతరావు, ఎండీ ఆయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, కాకి విజయ, సంకెపల్లి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.