calender_icon.png 27 November, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలి

27-11-2025 12:39:35 AM

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సమస్యనాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృ ష్టి పెట్టాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు పోలీస్ స్టేషన్లను ఎస్పీ సందర్శించారు. తొలుత కేసముద్రం పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల గురించి యూ.ఐ, పెండింగ్ కేసులు, మర్డర్ కేసులు, దొంగతనాలు ఇతర వివరాలు ఎస్.ఐ క్రాంతి కిరణ్ ను అడిగి తెలు సుకున్నారు.

అలాగే పోలీస్ స్టేషన్ సరిహద్దులను మ్యాప్ ద్వారా పరిశీలించారు. పంచా యతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యత్మక గ్రా మాల గురించి అడిగి తెలుసుకున్నారు. శాం తియుతంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగేలా చూసుకోవాలని అన్నారు. గ్రామపంచాయితీ ఎన్నికల దృష్యా అన్ని రకాలు గా సిద్ధంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాల వివరాలు వాటి పనితీరు తెలుసుకున్నారు.

అనంతరం ఇనుగుర్తి, నెల్లికుదురు పోలీస్ స్టేషన్లను సందర్శించారు. సిబ్బందితో మా ట్లాడి వారికీ ఏమైనా సమస్యలుంటే, తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వాహించాలని అన్నారు. ఎస్పీ వెంట కేసముద్రం సీఐ సత్యనారాయణ, కేసము ద్రం ఎస్.ఐ క్రాంతి కిరణ్, ఇనుగుర్తి ఎస్.ఐ కరుణాకర్, నెల్లికుదురు ఎస్.ఐ రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.