calender_icon.png 27 November, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుప్పత్రాలలో గడ్డివాములు దగ్ధం

27-11-2025 12:39:51 AM

అయిజ, నవంబర్ 26: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుప్పత్రాల గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి  గడ్డివాముకు నిప్పు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన కురువ హుస్సేన్, శేఖర్ లకు చెందిన గడ్డివాములు నిప్పు అంటుకొని కాలుతుండగా సమీపంలో ఉన్న స్థానికులు గమనించి అగ్నిమాపక కేంద్రంకు సమాచారం అందించారు. అప్పటికే గడ్డివాములు పూర్తిగా కాలిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పశువుల కోసం సేకరించిన గడ్డి వాములు మొత్తం ఖాళీ బూడిదైపోవడంతో.. దాదాపు 50 వేల రూపాయల నష్టం వాటి ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ఇదివరకే ఈ ప్రాంత ప్రజలు మొరపెట్టుకున్న ఫలితం శూన్యంగా ఉందని.. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.