18 April, 2026 | 11:47 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

వృద్ధాశ్రమంలో అన్న ప్రసాద వితరణ

10-05-2025 05:25 PM

సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందా పురం గ్రామం లో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో.  కోదాడ పట్టణానికి చెందిన కె . నరేష్   ( పోలీస్ ) పుట్టిన రోజు.  ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన కె.గోపి శ్రావణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు వారి సంయిక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ పాల్గొని, ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

తదుపరి సత్యనారాయణ మాట్లాడుతూ... ఇలా పుట్టిన రోజు వివాహ వార్షికోత్సవాలు అలాగే వారి వారి గృహాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా ఆశ్రమాలలో అన్నదానం చేయడం, పుణ్యకార్యం అని, ప్రతి ఒక్కరు స్పందించి, ఇలాంటి ఆశ్రమాలకు అన్నదాన కార్యక్రమాలతో పాటు ఎవరికి తోచిన విధంగా వారు. నిత్యావసర వస్తువులు కూరగాయలు. ఆశ్రమానికి కావాల్సిన. వివిధ. గృహపకరణ వస్తువులతో పాటు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయ సహకారాలు అందించి అండగా నిలవాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో దాతలు0 కె.నరేష్ కె.శ్రావణి,  డి.గోపి, మనస్వి ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి, విజయమ్మ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.