10-05-2025 05:18:57 PM
మందమర్రి: విజయక్రాంతి పట్టణం లోని అంగడి బజార్ శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించు కొని శనివారం ఆలయంలో అర్చకులు దిలీప్ శుక్ల శర్మ ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బం గా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం 25వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 9 నుండి 10వ తేదీ వరకు రెండు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు అన్నదానం నిర్వహించారు.రెండు రోజుల పాటు నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పట్టణంలోని ప్రముఖులు, వ్యాపారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.