calender_icon.png 10 May, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు

12-04-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): హనుమాన్ జయ ంతిని పురస్కరించుకొని ఒకరోజు ముందుగా జిల్లా కేంద్రంలోని పలు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజ లు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేశారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్ ఆలయంలో ఆనవాయితీ ప్రకారం ఒకరోజు ముందుగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వ హించారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మందిర అర్చకులు రామ్ చందర్ శర్మ, గురు స్వామి సుధాకర్, స్వాములు నరేష్, మహేష్, శేఖర్, రాజన్న, తిరుపతి, సురేష్ పాల్గొన్నారు. అలాగే బజార్ వాడి హనుమాన్ ఆలయంలో నిర్వహణ కమిటీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు.