10-05-2025 02:33:04 PM
రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్
తుంగతుర్తి, విజయ క్రాంతి: తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు(Senior Congress leaders of Ravulapalli village) ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి కేతిరెడ్డి విజయసేనారెడ్డి 34వ వర్ధంతి వేడుకలు ఆయన సతీమణి కేతిరెడ్డి సుజనా రెడ్డి కూతుర్లు, కుమార్తెలు అడ్ల శ్రీదేవి, నల్ల శ్రీలక్ష్మి సూచనలతో పోలేపాక రామచంద్రు ఆధ్వర్యంలో శనివారం రావులపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ కమిషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విజయసేనారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ... గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ విజయసేనారెడ్డి ఈ గ్రామానికి మంచినీటి సౌకర్యం రోడ్లు, రోడ్లు, ఎస్సీ కాలనీలో 150 ఇండ్లను నిర్మించి ఘనత ఇంద్రసేనారెడ్డిది అన్నారు.ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతకుంట్ల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేతినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపిటిసి చింతకుంట్ల బాబు, నన్నే బోయిన సుధాకర్, భూతం లింగయ్య, చింతకుంట్ల నగేష్, వీరన్న, ఐత వెంకన్న, లింగయ్య, రామ్మూర్తి,రవి, చింతకుంట్ల చింతయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజయసేనారెడ్డి అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.