10-05-2025 02:52:57 PM
న్యూఢిల్లీ: భారతదేశం, పాకిస్తాన్ మధ్య భద్రతా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) శనివారం త్రివిధ దళాల అధిపతులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆపరేషన్ సిందూర్, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించనున్నారు. శనివారం ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివరించనున్నారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం ప్రధాని కీలక సూచనలు చేయనున్నారు. భారత్‌పై దాడుల్లో పాక్ వ్యూహం మార్చింది. గత రెండు రోజులుగా రాత్రివేళ డ్రోన్లతో దాడి చేస్తోంది. నేడు ఉదయం సమయంలోనూ కీలక ప్రాంతాలపై పాక్ దాడులకు తెగబడింది. పాక్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. అటు పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ 1 బిలియన్ డాలర్ల నిధులు విడుదల చేసింది. దీంతో పాకిస్తాన్ ఖాతాలో రూ.8,500 కోట్ల నిధులు జమ కానున్నాయి.