calender_icon.png 10 May, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురునానక్ కాలేజీ విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య

10-05-2025 12:52:08 PM

ఇబ్రహీంపట్నం: గురునానక్ కాలేజీకి చెందిన విద్యార్థిని(Guru Nanak College student) హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, కురన వెళ్లి గ్రామానికి చెందిన అల్లూరి భావన, తండ్రి పేరు శశి రెడ్డి. వయసు (22), రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. కాగా శనివారం ఉదయం 10 గంటలకు హాస్టల్లో ఉరివేసుకొని చనిపోయింది. భావన తల్లిదండ్రులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, మరొక అమ్మాయి జూబ్లీహిల్స్ లో బిఎస్సి నర్సింగ్ చదువుతుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.