10-05-2025 01:47:57 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): వాకర్స్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం మహబూబాబాద్ పట్టణ విధానావర్తక సంఘం నూతన కమిటీ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అద్యక్షులు సోమ రత్నశేఖర్ , కార్యదర్శి కొండ్లె భద్రినాధ్, కోశాధికారి గుండా మధు రెడ్డిని ఘనంగా సన్మానించారు. క్లబ్ సీనియర్ ప్రతినిధులు చౌడవరపు సుధాకర్, పరకాల రవీందర్ రెడ్డి, ఆకుల రాజు మాట్లాడుతూ... కమిటీ ప్రతినిధులు వర్తకుల సమస్యలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించిన వర్తకులతో పాటు ఇతర ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాఫీ క్లబ్ సభ్యులు డాక్టర్ బి. వీరన్న, ముల్లంగి మోహన్ రెడ్డి, బోనగిరి గంగాధర్, మాలె కాళీనాథ్, హేమచందర్, ఆకుల శ్రీకాంత్, చిదిరాల శరత్ కుమార్, కొల్లూరి రవికుమార్, ఆరీఫ్, నరెడ్ల రమేష్, శిరంశెట్టి రఘు, రిటైర్డ్ హెచ్ఎం శ్రీరాం రమేష్, జర్నలిస్టు ఫయిజ్, ఎర్రంరెడ్డి సతీష్ రెడ్డి, నూకల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.