పెళ్లిరోజు.. మానసిక వికలాంగులకు అన్నదానం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునర్వాస కేంద్రంలో గురువారం సుద్దాల గ్రామానికి చెందిన అవిరినేని జ్యోతి సతీశ్ రావు పెళ్లిరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ... ఎన్ని దానాలు చేసినా ఇక చాలు అని చెప్పరు.
అదే ఒక అన్నదానం చేస్తే కడుపు నిండిన తర్వాత ఇక చాలు అని చెప్పే ఏకైక పదం ఉందంటే అది కేవలం అన్నదానం అని అన్నారు, సతీష్ రావు చాలా కాలంగా మా ఫౌండేషన్ కు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దేశెట్టి రమేష్, సెంటర్ ఇంచార్జ్ శ్రీనివాస్, సిబ్బంది సరస్వతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.






