కామారెడ్డి పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
13-08-2026 05:16 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ మునూరు కాపు సంఘం అధ్యక్షులుగా ముదాం వెంకటేశ్వర్ (వెంకన్న) ,ప్రధాన కార్యదర్శిగా రామడిపేట రాజు, కోశాధికారిగా అనుమండ్ల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ముదాం వెంకటేష్ మాట్లాడుతూ... కామారెడ్డి పట్టణ మున్నూరుకాపు సంగం అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకెళ్తానని పేర్కొన్నారు. అనంతరం కుల సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. త్వరలోనే పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు.






