6 June, 2026 | 1:41 AM

పేద ఆంధ విద్యార్థులకు అన్నదానం

06-06-2026 12:00 AM

మూల రాజ్ కుమార్ గౌడ్ జయంతి

తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసలు

సనత్‌నగర్, జూన్ 5 (విజయక్రాంతి):- పేద ఆంధ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకుడు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మూల రాజ్ కుమార్ గౌడ్ జయంతిని శుక్రవారం బేగంపేట లోని దేవనార్ ఆంధ విద్యార్థుల స్కూల్ లో అమీర్ పేట కు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు చెందిన బాబా, వేణు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అభిలాష్ రెడ్డి, కిషోర్ ల ఆధ్వర్యంలో  నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ లు ముందుగా రాజ్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్ కుమార్ గౌడ్ కుమారుడు గౌతమ్ గౌడ్, మనువడు తారక్ లతో కలిసి కేక్ కట్ చేశారు.

తదనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు టి. మహేశ్వరి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బిఆర్ ఎస్పార్టీ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్, కిషోర్, ప్రవీణ్ రెడ్డి,  శేఖర్, ఆరీఫ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.