11-05-2025 06:38:11 PM
తనిఖీలకు ఎప్పుడొస్తారో తెలియదు
తనిఖీలకు వస్తే యజమానులకు ముందే లీక్
నాణ్యత లేకుండా కల్తి పదార్థాల విక్రయం
జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ మండలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ జాడ కనిపించడం లేదు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారు తెలియడం లేదు. హోటల్లో కిరాణా దుకాణాలు టిఫిన్ సెంటర్లో నాణ్యత లేకుండా ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. పర్యవేక్షించి నాణ్యతలేని వాటిని అరికట్టాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు వస్తున్నారు. ఎప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారో వారికే తెలియాలి. మారుమూల మండలమైన నియోజకవర్గ కేంద్రమైన జుక్కల్ మండల కేంద్రంలో ఇప్పటివరకు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడు వస్తారు ఎవరికి తెలియదు అని మండల ప్రజలు పేర్కొంటున్నారు. వచ్చిన గాని ఆయా షాపుల యజమానులకు ముందుగానే సమాచారం లీక్ చేస్తారని తెలుస్తోంది.
ఈ విషయం తెలియగానే షాపులో యజమానులు అందరూ కలిసి కొన్ని డబ్బులు పోగు చేసి జుక్కల్ కు రాకుండా చేశారని విమర్శ లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వేరే ప్రాంతంలో ఉండి కూడా ఆయన అమ్యమ్యలకు ఆశపడి జుక్కల్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కిరాణా షాపుల్లో ఎన్నో ఒరిజినల్ వస్తువులతో పాటు డూప్లికేట్ వస్తువులు విక్రయాలు చేపడుతున్నారు. స్థానికులు గమనించామని వారు చెబుతున్నారు. అదేవిధంగా హోటల్లో చేసే పదార్థాలను తినుబండరాలను గతంలోనే చేసిన వంట కు వాడిన పాత నూనెను అందులోనే వేరే తిను బండారాలు తయారు చేస్తారని చెబుతున్నారు. ఇదే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఎప్పటినుంచో వాడిన నూనెని అందులో నుంచి చికెన్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ లాంటివి తయారు చేస్తున్నారని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండల ప్రజ లు ఆరోపిస్తున్నారు.
దీంతోపాటుగా ఉదయం పూట ప్రారంభం అయ్యే టిఫిన్ సెంటర్లలో కల్తీ నూనె వాడతారని, టేస్ట్ రావడానికి వేరే రసాయనాలను కూడా వాడతారని చెబుతున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్ అసలు జాడ కనిపించదని మండల ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఆయా షాపుల్లో బాల కార్మికులు ఉన్నాగాని పట్టించుకోరని ఆరోపిస్తున్నారు. కనీసం నెలకు ఒకసారి వచ్చి పర్యవేక్షణ చేయాల్సింది పోయి నిమ్మకు నీరు ఎత్తినట్లు జిల్లా కార్యాలయంలో కూర్చొని నెలవారి మామూళ్లకు ఆశపడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తారనే నానుడి నిజంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. కొన్ని ఏళ్ల క్రితం నుంచి కూడా ఒకరి పైన యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవని చెబుతున్నారు. ఈ విషయమై సంబంధిత జిల్లా కలెక్టర్ గానీ అధికారులు గానీ స్పందించి వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ తో జుక్కల్ మండలంలో తనిఖీలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.