19 April, 2026 | 3:20 AM

ట్రాఫిక్ నియమాలు పాటించాలి

19-04-2026 01:29 AM

మల్కాజిగిరి డీసీపీ సిహెచ్.శ్రీధర్ 

సికింద్రాబాద్, ఏప్రిల్ 18(విజయక్రాంతి):  ‘స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్టీ’ అనే నినాదాన్ని పాటిస్తూ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకుంటారని మల్కాజిగిరి డీసీపీ సిహెచ్.శ్రీధర్ తెలియజేశారు. బోయిన్‌పల్లి  చౌరస్తాలో బేగంపేట్ ఏసీపీ పి.గోపాల కృష్ణమూర్తి పర్యవేక్షణలో బోయిన్‌పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు ఆధ్వర్యంలో ‘అరైవ్ -అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా మల్కాజ్‌గిరి జోన్ డీసీపీ సిహెచ్.శ్రీధర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా లారీ, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులకు రోడ్డు భద్రత,ట్రాఫిక్ అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతపై మరింత ప్రజలకు వాహనదారులలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని డీసీపీ సిహెచ్ శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్‌క్టర్లు, ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసు లు, సిబ్బంది పాల్గొన్నారు.