1 July, 2026 | 6:45 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •  

తాజాదనం కోసం..

09-02-2025 12:15 AM

ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో పనిచేస్తే కష్టపడి చూడాల్సి ఉంటుంది. దీంతో కళ్లు త్వరగా, బాగా అలసిపోతాయి. కాబట్టి తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు డిజిటల్ పరికాలను చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయని అంటున్నారు నిపుణులు.. అలాంటివారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి..

తల మీద నేరుగా కాంతి పడినా, కిటికీ నుంచి ప్రకాశవంతమైన ఎండ పడినా తెరను చూసేటప్పుడు కళ్లకు ఇబ్బంది కలుగుతుంది. వీలైతే ఫ్లోర్ ల్యాంప్స్ అమర్చుకోవాలి. 

ఒకవేళ కిటికీ తెరవడం తప్పనిసరైతే పక్కవైపు నుంచి కాంతి పడేలా చూసుకోవాలి. కిటికీకి ఎదురుగా గానీ కిటికీకి వీపు చేసి గానీ కూర్చోవద్దు. కర్టెన్లు వేస్తే బయటి వెలుగు తగ్గించుకోవచ్చు. 

డిస్‌ప్లే మీద యాంటీ గ్లేర్ స్క్రీన్ బిగిస్తే కళ్లకు హాయిగా ఉంటుంది. ఒకవేళ కళ్లద్దాలు ధరిస్తే యాంటీ రిఫ్లెక్టింగ్ ఉన్న గ్లాసెస్ ఎంచుకోవాలి. 

అదేపనిగా కంప్యూటర్‌ను చూడటం మంచిది కాదు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పక్కకు తిరిగి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కనీసం 20 సెకండ్ల పాటు చూడాలి. దీంతో కంట్లోని కండరాలు వదులవుతాయి. అలసట తగ్గుతుంది. 

చేసేపని నుంచి తరచూ విరామం తీసుకోవాలి. ప్రతి గంటకూ కనీసం 10 నిమిషాల సేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. కంప్యూటర్ మీద పనిచేయడం వల్ల తలెత్తే మెడ, వీపు, భుజాల నొప్పి తగ్గటానికిది తోడ్పడుతుంది. కళ్ల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.