అమ్మ గౌరవం కోసం
08-06-2024 01:29 AM
వెయ్యి జాబులైనా వదులుకుంటా
కంగనను కొట్టిన కానిస్టేబుల్
న్యూఢిల్లీ, జూన్ 7: కన్నతల్లి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఒకటి కాదు వెయ్యి ఉద్యోగాలైనా పోగొట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నానని చండీగఢ్ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను కొట్టిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్‌కౌర్ ప్రకటించారు. కంగనను కొట్టినందుకు కుల్విందర్‌ను సీఐఎస్‌ఎఫ్ సస్పెండ్ చేసింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్స్‌లో కుల్వింద్ ఓ పోస్టు పెట్టారు. ‘ఈ ఉద్యోగం పోయినందుకు నేనేమీ బాధపడటంలేదు. మా అమ్మ గౌరవాన్ని కాపాడేందుకు ఇలాంటి వేల ఉద్యోగాలు కోల్పోయేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.






