కవితకు 21 వరకు కస్టడీ
08-06-2024 01:30 AM
సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ, జూన్ 7: లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. ఆమె కస్టడీ శుక్రవారం ముగియటంతో సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జైల్లో తనకు పుస్తకాలు చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని, పుస్తకాలు ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని ఆమె కోరారు. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణను జూన్ 21కి వాయిదా వేసింది.






