16 July, 2026 | 9:58 AM

ఎన్టీఆర్ సినిమా కోసం..

17-06-2024 12:16 AM

ఇటీవల ప్రకటించిన కొత్త విడుదల తేదీతో ‘దేవర’ రాకకు మార్గం సుగమం అయింది. కాగా ఎన్టీఆర్ తర్వాతి సినిమా పనులు కూడా వేగం పుంజుకుంటున్నాయి. పూర్వ నిర్మాణ పనుల్లో భాగంగా ముఖ్య నటీనటుల ఎంపిక పూర్తి చేయాలనుకున్న చిత్ర బృందం ఎన్టీఆర్ సినిమా కోసం ఇద్దరు నటులను ఖాయం చేశారని సమాచారం. వారే బాబీ డియోల్, రష్మిక మందన్న. ఇప్పటికే పలు భారీ చిత్రాలలో ప్రతినాయక, కథానాయిక పాత్రల్లో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వీరిద్దరినీ, ఎన్టీఆర్ కథానాయకుడిగా తాను చేయనున్న సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

‘దేవర’ తొలి భాగం చిత్రీకరణ తుది దశకు చేరుకోగా, తొలి బాలీవుడ్ చిత్రమైన ‘వార్ 2’ని ఎన్టీఆర్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ ‘వార్’ ముగిశాకే నీల్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉంది. వివిధ దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగనుండగా, తొలి షెడ్యూల్ మొరాకొలో జరుగనుందట.