16 July, 2026 | 9:50 AM

మామయ్యతోనే ‘స్టార్‌వార్స్ లెగో’ పరిచయం

17-06-2024 12:21 AM

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణులతోపాటు ఆయన అభిమానులు, కుటుంబ సభ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీ వల తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అత్యంత ఖరీదైన పెన్నును తన మరిది పవన్‌కు బహుమతిగా ఇచ్చారు. తాజాగా పవన్ మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ క్రేజీ గిఫ్ట్‌ను అందించి అభిమానం చాటుకున్నాడు. సంబంధిత ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. “నన్ను ‘స్టార్‌వార్స్ లెగో’కు పరిచయం చేసిన నా ప్రియమైన జేడీ మాస్టర్ అండ్ డిప్యూటీ సీఎం.. తనలోని పిల్లాడికి దాన్ని కానుకగా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది.

నా చిన్ననాటి రోజులను తిరిగి గుర్తు చేసుకునేందుకు ఇలా అవకాశం వచ్చింది” అంటూ ధరమ్ తేజ్ ట్విట్‌లో సంతో షాన్ని వ్యక్తం చేశాడు. స్టార్‌వార్స్ లెగో ధర ప్రస్తుతం మార్కెట్లో అక్షరాలా లక్షా ముప్పు వేలు! ఇక, పవన్‌కు ఆయన వదినమ్మ సురేఖ ఇచ్చిన మోంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్నులు విభిన్న మోడళ్లు, రంగుల్లో ఉండగా, వాటి ధరలు రూ.90 వేల నుంచి రూ.2.60 లక్షల దాకా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలి నడకన కొండపైకి వస్తానని మొక్కుకున్న ధరమ్ తేజ్ అది నెరవేరడంతో ఇటీవల అలిపిరి మెట్ల మార్గంలో తిరమలేశుడిని దర్శించుకున్నాడు.