29న ఎన్టీఆర్ అవార్డ్స్ ప్రదానం
17-06-2024 12:13 AM
దివంగత నటుడు నందమూరి తారక రామారావు పేరుతో సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో పలువురు కళాకారులకు ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ చాలా కాలంగా అందజేస్తున్నది. ఈ సంవత్సరం కూడా ఈ వేడుక నిర్వహించనున్నారు. జూన్ 29న హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో ఆర్‌వీ రమణమూర్తి కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో జరగనున్నది. ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విడుదల చేశారు.






