విజయ వంతమైన చిత్రం కోసం చేతులు కలిపిన హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో ‘విశ్వం’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలకు తెరలేపుతూ ‘జర్నీ ఆఫ్ విశ్వం’ పేరిట ఓ వీడియోని ఆన్‌లైన్ వేదికల్లో ఉంచారు చిత్ర బృందం. దీని ద్వారా ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, హాస్యం మేళవిస్తూ ఓ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చివరిగా చమ్మక్‌చంద్ర తదితరులతో కనపడిన రైలు సన్నివేశం దర్శకుడు ‘వెంకీ’ చిత్రాన్ని గుర్తుచేసేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోణెపూడి నిర్మిస్తున్న చిత్రానికి సినిమాటోగ్రఫీ: కెవి గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటర్: అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మన్నె.