పిల్లల రక్షణ కోసం..
07-04-2026 12:00 AM
బెజ్జూర్, ఏప్రిల్ ౬ (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాల సురక్ష (చైల్ సేఫ్టీ)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ‘సేఫ్ టచ్.. అన్‌సేఫ్ టచ్’ గురించి విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ వసంత్ కుమార్ అభ్యర్థన మేరకు, ఇంపాక్ట్ సంస్థ సభ్యులు కే .దర్శన, కే .దుర్గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బాల రక్ష ట్రైనర్ కుడ్మేత చెంచులక్ష్మి ఈ కార్యక్రమం నిర్వహించారు.




