calender_icon.png 12 July, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోగస్ విలేకరులపై నియంత్రణ కోసమే

12-07-2025 12:00:00 AM

స్టాండింగ్ కమిటీలో చర్చపై మేయర్ విజయలక్ష్మి స్పష్టత 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): మీడియా ముసుగులో కొంతమంది బోగస్ విలేకరులు జీహెచ్‌ఎంసీ అధికారులను, భవన నిర్మాణదారులను, ప్రజలను తీవ్రస్థాయిలో వేధింపులు గురి చేయడంతో పాటు బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని, వారి బెడద నుంచి కాపాడాలని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీలో అన్ని పార్టీల సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు.

నకిలీ విలేకరుల సమస్యపై అనేక ఫిర్యాదులు ప్రజా ప్రతినిధులకు వస్తున్నాయని చెప్పారు. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో తిష్టవేస్తూ అధికారులను సైతం అనేక రకాలుగా వేధిస్తున్నారని అన్ని సర్కిళ్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ సభ్యుల డిమాండ్ మేరకు త్వరలో బోగస్ విలేకరులను ఆయా సర్కిల్ కార్యాలయాల్లో, ప్రధా న కార్యాలయాల్లో రాకుండా చూడాలని సభ్యులు తీర్మానం చేయాలని కో రారని స్పష్టం చేశారు.

గుర్తింపు పొం దిన మీడియా సంస్థలకు, గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు అ డ్డంకులు కల్పించాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. గుర్తింపు పొంది న మీడియా సంస్థలు, ప్రతినిధులు ఎలాంటి ఆపోహాలకు గురికావద్దని కోరారు.