12-07-2025 09:52:02 AM
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారిపై(Kamareddy National Highway) భారీ దారి దోపిడీ జరిగింది. ఓ ట్రక్కు నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ అయ్యారు. సెల్ ఫోన్ల లోడుతో వెళ్తూ ట్రేకియాల్ వద్ద విశ్రాంతి కోసం ట్రక్కు డ్రైవర్ ఆగాడు. కాసేపటి తర్వాత చూస్తే ట్రక్కులో వెనుకవైపు డబ్బాలు మాయం అయ్యాయి. సెల్ ఫోన్లు ఉన్న డబ్బాలు మాయంపై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.