12-07-2025 10:17:52 AM
హైదరాబాద్: రామంతాపూర్(Ramanthapur) పరిధిలోని వివేక్ నగర్‌లో శనివారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూసీ కాలువ పక్కన నిర్మానుష్య ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు మగశిశువును వదిలి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. శిశువును గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును ఎవరు వదిలిపెట్టారన్న కోణంలో సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.