భద్రకాళి ఆలయ హుండీలో విదేశీ కరెన్సీ
వరంగల్, జూన్ 30 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానం హుండీల లెక్కింపు జరుపగా 85,03,997 రూపాయ ల ఆదాయం లభించింది. అయితే ఇందులో విదేశీ కరెన్సీ నోట్లు, డాలర్లు భక్తుల సమర్పించారు. 200 యూ.ఎస్.ఏ డాలర్లు, 260 కెనడా డాలర్లు, 30 యూ.ఏ.ఈ దిరమ్స్, 30 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పౌండ్స్, 300 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్ కరెన్సీ ,2 సింగపూర్ డాలర్లు లభించాయి.
హుండీలో భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారం, వెండి తిరిగి హుండీలో నిక్షిప్తం చేశారు. హుండీలో లభించిన కరెన్సీ మాత్రం యూనియన్ బ్యాంక్ కేఎంసీ శాఖలో జమ చేశారు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ ఉపకమీషనర్ కార్యాలయ పర్యవేక్షకులు ఈ. గౌరీశంకర్, దేవాలయ ఈ.ఓ, ఏ.సి రామల సునీత, ఆలయ ప్రధానార్చకులు శేషు, శ్రీ లక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ అధ్యక్షులు జి. కృష్ణారెడ్డి, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి అధ్యక్షులు జి. నవీన్ ఆధ్వర్యంలో సభ్యులు 200 మంది, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.






