30 August, 2026 | 11:20 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

విదేశీ విద్య స్టుఫైండ్ నిధులు విడుదల చేయాలి

19-10-2024 12:29 AM

సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18(విజయక్రాంతి) : మూడేళ్లుగా విదేశీ విద్య స్టుఫైండ్ నిధులు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు వెంటనే విదేశీ విద్య స్టుఫైండ్ నిధులు విడుదల చేయాలని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతో విదేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో చదువు తున్న విద్యార్థులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను వెంటనే చెల్లించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.