08-08-2025 01:13:25 AM
రాజ్ గొండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు
ఆదిలాబాద్, ఆగస్టు ౭ (విజయక్రాంతి): అటవీ భూముల్లో అభివృద్ధి పేరుతో ఆదివాసీలపై అటవీ శాఖ దౌర్జన్యాలను ఆపాల ని మాజీ ఎంపీ, రాజ్ గొండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నా రు. మిగితా ఆదివాసీ సంఘాల మాదిరిగా రాజ్ గోండ్ సేవ సమితి లొల్లిలు సృష్టించేది కాదని, డబునులు వాసులు చేసేది కాదన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో జిల్లాలోని ఆయా మండల అధ్యక్ష కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ...
ఆదివాసుల సమస్యలను పరిష్కరించడానికి, వారి అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు తానూ రాజ్ గోండ్ సేవ సమితిలో చేరరాన ని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో ఆదివాసుల సమస్యలు అన్నిటిని ప్రభుత్వనికి వివరించానని రాబోయే రోజుల్లో ప్రతి ఆదివాసీ గూడ లకు రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని తెలిపారు. తానూ తన జాతి ఉపయోగం కోసమే పని చేస్తానని, తనకు ఏ పదవి లేనప్పటికీ బోథ్ నియోజవర్గంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, పొలం బాట లో రైతులకు ఉపయోగ పడే గ్రావెల్ రోడ్లను మంజూరు చేయించానన్నారు.
బీజేపీ ప్రభు త్వం మణిపూర్ రాష్టంలో ఆదివాసులపై దౌర్జన్యాలు చేస్తుందని దీనికి రాబోయే రోజు ల్లో ఆదివాసులే గుణపాఠం చెబుతారన్నా రు. బీజేపీ సర్కార్ అమాయక ఆదివాసీ జనాన్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉం చుతుందని ఆరోపించారు. ఆదివాసులకు అన్యాయంగా ఉన్న జిఓ 49ను నిలిపేందుకు తాను, రాష్ట్రపతి ముర్ము, గవర్నర్, ఆయా కేంద్ర రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలను అందజేశానని గుర్తు చేశారు.
ఐటీడీఏ లో ప్రత్యేకంగా ఆదివాసీ లకు ఉద్యోగాలు కల్పించాలని, అటవీ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గూడాల్లో మెరుగైన రోడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 130 రాయి సెంటర్‌లకు నూతన భవన నిర్మాణాలకు గాను ఒక్కో దానికి రూ. 15 లక్షల చొప్పున నిధులు, గిరి పథకం పకడ్బందీగా అమలు, పెర్సపేన్ ఆల య అభివృద్ధి లాంటి విషయాలపై ముఖ్యమంతి రేవంత్‌రెడ్డితో చర్చించానాని, సాను కూలంగా స్పందించి త్వరలోనే అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇఛ్చారన్నారు.
వచ్చే 09వ తేదీన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రములో రాజ్ గోండ్ సేవ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సభ నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ హాజరై జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమితి జిల్లా అధ్యక్షులు పంద్రం శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సెడ్మకి ఆనంద్ రావు ఉపాధ్యక్షులు ఉయక లక్ష్మన్ డివిజన్ అధ్యక్షులు దుర్వ విశ్వేశ్వర్ రావ్, జైరాం ఆడేం, భీంరావ్, ఆత్రం గంగారాం, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.