calender_icon.png 9 August, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

09-08-2025 08:40:30 AM

హైదరాబాద్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలే మన వారసత్వానికి అసలైన సంపద అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’(World Indigenous Peoples Day) సందర్భంగా ఆదివాసీ సోదర, సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి శుభాభినందనలు తెలియజేశారు. సమాజాభివృద్ధిలో ఆదివాసుల పాత్రను గుర్తించి వారి హక్కులు, జీవన విధానాల పరిరక్షణకు, సమాన హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి(United Nations) ప్రకటించింది. 1982, ఆగస్టు 9న జెనివాలో అటవీ వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం(United Nations approval) తెలిపింది. ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.