09-08-2025 10:32:10 AM
బాన్సువాడ, (విజయ క్రాంతి): రాఖీ పౌర్ణమి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తన స్వగృహంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి(Pocharam Srinivas Reddy) కి సోదరీమణి దొడ్ల సత్యవతి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని ఆయన తెలిపారు.ఈ రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.