calender_icon.png 9 August, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాన్మాజీపేట్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

09-08-2025 10:29:44 AM

జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోoకి గణేష్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హాన్మాజీపేట్ గ్రామంలో శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలను కామారెడ్డి జిల్లా మాజీ ఆదివాసి ప్రధాన కార్యదర్శి కోoకి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాటం సాగించిన అమరవీరుడు కొమరం భీమ్ ఆశయాలు సాధించే దిశగా మనం కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. కుల బాంధవులందరికీ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన కుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కుల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పేoకటి గణేష్ కొంకి పోచయ్య,మ్యకల లింగం,కొంకీ రాజు, కొంకి చిరంజీవి, కులస్తులు గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.