08-08-2025 01:12:59 AM
- జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి
- ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వ ర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల ని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో ప్రజ లు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సీఎం సూచించారు.
సీఎస్, డీజీపీ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులతో ఢిల్లీ నుంచి రేవంత్‌రెడ్డి గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.