calender_icon.png 9 August, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు

09-08-2025 09:28:10 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా(Prakasam District) చాకిచెర్ల వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి వ్యానును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. పిడుగు రాళ్ల నుంచి తిరుమల(Tirumala Tirupati Devasthanams) దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.