09-08-2025 08:24:58 AM
తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రోగ్రెసివ్ రికగ్నైజేషన్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా(PRTU State Associate President) తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ హరికిషన్ ఎర్రను తెలంగాణ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తంగెళ్ల జితేందర్ రెడ్డి,తీగల నరేష్ ఎంపిక చేశారు.రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి జిల్లా శాఖ బాధ్యులు వివిధ మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు సోదర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ అభినందించారు. ఎర్ర హరికిషన్ గతంలో తుంగతుర్తి మండలానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా పనిచేశారు ప్రస్తుతం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు రాష్ట్ర శాఖ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. దీనితో తుంగతుర్తి ప్రాంత ఉపాధ్యాయ, అధ్యాపక బృందం, మేధావులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.