26 August, 2026 | 2:28 AM

జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

26-08-2026 12:00 AM

చెన్నూర్ కోర్ట్ మెజిస్ట్రేట్ పర్వతపు రవి

చెన్నూర్, ఆగస్టు 25 : మంచిర్యాల జిల్లా చెన్నూరులో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని చెన్నూర్ కోర్ట్ మెజిస్ట్రేట్ పర్వతపు రవి అన్నారు. మంగళవారం చెన్నూరు కోర్టులో సిబ్బంది, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు.

లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్క రించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కేసులను గుర్తించి, సంబంధిత పక్షాలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని న్యాయవాదులకు సూచించారు.

లోక్ అదాలత్కు హాజరయ్యే కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోర్టు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొలిపాక రవీందర్, ఎస్ రమేష్ సెక్రటరీ కాగిత మహేష్, పున్నం, పి లక్ష్మణ్, ప్రభాకర్, శ్రీలత, రమాదేవి కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.