28 August, 2026 | 11:21 AM

మానవత్వం మరిచి.. మామపై దాడి

09-12-2024 01:46 AM

వృద్ధుడిపై చెప్పుతో దాడి చేసిన కోడలు

నల్లగొండ జిల్లాలో అమానుషం

నల్లగొండ, డిసెంబర్ 8 (విజయక్రాంతి): అవసాన దశలో అనారోగ్యంతో కదలలేని స్థితిలో వీల్‌చైర్‌పై బతుకీడుస్తున్న మామపై కనికరం లేకుండా కోడలు విచక్షణారహితం గా దాడికి తెగబడింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో పైశాచిక కోపంతో ఊగిపోతూ చెప్పుతో మొహంపై పదేపదే కొట్టి రాక్షసం గా వ్యవహరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శెట్టిపాలెం గ్రామానికి చెం దిన గగినపల్లి బుచ్చిరెడ్డి(70)కి ఇద్దరు కుమారులు. ఆస్తి కుమారులకు పంచినా ఆయన పేర ఉన్న భూమి విషయంలో కొం తకాలంగా కుమారుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో చిన్న కుమారుడు శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న బుచ్చిరెడ్డిపై పెద్ద కోడలు మణిమాల ఇటీవల చెప్పుతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దృశ్యాలు ఇంటి పక్కనే ఉన్న సీసీకెమెరాలో రికార్డయ్యాయి.

ఆదివారం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కొట్టొందంటూ వృద్ధుడు వేడుకుంటున్నా కనికరించకుండా కోడలు వ్యవహరించిన తీరు స్థానికులకు, నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మణిమాలపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.