అవి చార్జిషీట్లు కావు.. రిప్రజెంటేషన్లు !
09-12-2024 01:46 AM
* బీఆర్‌ఎస్, బీజేపీ దొందూ దొందే: మంత్రి పొన్నం
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై బీఆ ర్‌ఎస్, బీజేపీ విడుదల చేసినవి ఛార్జీషీట్లు కాదని, వారి రిప్రజెంటేషన్ మాత్రమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. అబద్ధాలు వల్లెవేయడంలో ఆ రెండు పార్టీలు దొందూ దొందేనని పేర్కొన్నారు. వారి చార్జీషీట్లను తప్పకుండా పరిశీలిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శలకు పాల్పడుతున్నాయని, పిల్లి శాపనార్థానాలను తమ ప్రభుత్వం పట్టించుకోదని, ప్రభుత్వాన్ని అస్థిరపర్చే ప్రయత్నాలను తిప్పికొడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.






