నేటినుంచి కాంగ్రెస్ సేవాదళ్ కమిటీల ఏర్పాటు
27-07-2026 12:40 AM
జిల్లా అధ్యక్షుడు నరసింహారావు
చండ్రుగొండ, జులై 26, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేటి నుంచి అన్ని మండలాల్లో కాంగ్రెస్ సేవాదళ్ విభాగం కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కేశ బోయిన నరసింహారావు తెలిపారు.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో సేవాదళ్ విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోదమూరి దయాకర్ రావుతో పాటు జాతీయ సేవాదల అధ్యక్షులు శ్రీనివాస్ జి నీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సేవాదళ్ విభాగం బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని, జాతీయ సేవాదళ్ అధ్యక్షులు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఈనెల 27నుంచి అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో సేవాదళ్ విభాగం కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం ఆయన తెలిపారు.






