27 July, 2026 | 1:11 AM

సాగు నీరు ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తా

27-07-2026 12:38 AM

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

కోదాడ జూలై 26,సాగు నీరు ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తానని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ మండల పరిధిలోని గణపవరం స్టేజ్ వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్షోభం లో వ్యవసాయం మహా ధర్నా కార్యక్రమానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. కే సి ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24గంటలు విద్యుత్ సరఫరా జరిగిందని నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు.

నీటి పారుదల శాఖ మంత్రి సొంత నియోజకవర్గానికి సాగర్ నీళ్లు ఇవ్వకుండా పక్కా జిల్లాకు తరించుకుపోయారంటే ఆయనకు నియోజకవర్గ ప్రజలపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని అన్నారు.లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కేవలం కమిషన్ కోసమే తప్ప ప్రజల ప్రయోజనం కోసం కాదని అన్నారు. ప్రజలకు తాగు సాగు నీరు వెంటనే అందించకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపుగల్లు గ్రామ సర్పంచ్ దొంతగాని అప్పారావు, గణపవరం మాజీ పొట్ట శ్రీవిజయ కిరణ్,తొగర్రాయి మాజీ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ, రామలక్ష్మీపురం గ్రామ శాఖ అధ్యక్షులు అంజిరెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు వరదారావు,బ్రహ్మం, వేలాద్రి వరదారావు,తదితరులు పాల్గొన్నారు