గ్రామాల్లో రోడ్డు సేఫ్టీ కమిటీల ఏర్పాటు
కేసముద్రం, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కేసముద్రం ఎస్ ఐ క్రాంతి కిరణ్ తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న అరైవ్ అలైవ్ 2026 అందరూ భాగస్వాములు కావాలనీ ఎస్ ఐ పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన పెంపొందించడానికి సోమవారం నుండి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి, రక్షణ చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు.
రోడ్డు భద్రత వారోత్సవాల నేపథ్యంలో నేటి నుండి కేసముద్రం మండల పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు ఎస్ ఐ తెలిపారు. అదేవిదంగా నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈసందర్భంగా ఎస్ ఐ హెచ్చరించారు. కేసముద్రం మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీ కమిటీనీ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీలో ఉప సర్పంచ్ పాటు గా విద్యావంతులైన యువకులను 8 మంది సభ్యులుగా ఉంటారని చెప్పారు. వీరు ఆయా గ్రామాల్లో ప్రమాదాలు జరుగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై వాహనదారులకు సూచనలు చేస్తారని ఈసందర్భంగా ఎస్ ఐ తెలిపారు.




