25-09-2025 03:23:55 PM
హనుమకొండ, (విజయ క్రాంతి): భవిత శ్రీ చిట్ ఫండ్స్ అధినేత, వరంగల్ నగర మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావును(Former Mayor of Warangal City Gunda Prakash Rao) పోలీసులు గురువారం ఉదయం అదుపులో తీసుకున్నారు. ఉదయం ఎంజీఎం లో వైద్య పరీక్షలు నిర్వహించారు.చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. పలువురికి చిట్టి డబ్బులు చెల్లించే విషయంలో జాప్యం జరిగి పలువురు సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇట్టి విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు హన్మకొండ సిఐ మచ్చ.శివ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఉన్న పాత కేసుల విషయం లో పోలీసులు కేసు నమోదు చేశారు. గుండా ప్రకాష్ రావు, టి. శ్రీనివాసులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గురువారం సాయంత్రంలోగా న్యాయమూర్తి ముందట హాజరు పరచనున్నట్లు సమాచారం.